Sunday, March 14, 2010

ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో...



ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో
అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను
నా గుండె ఏ నాడో చేజారిపోయింది
నీ నీడ గా మారీ నా వైపు రానంది
దూరాన ఉంటూనే ఏం మాయ చేసావో!


నడి రేయిలో నీవు నిదురైన రానీవూ
గడిచేదెలా కాలమూ... ?
పగలైన కాసేపు పని చేసుకొనీవూ
నీ మీదనే ధ్యానమూ...


ఏ వైపు చూస్తున్నా నీ రూపే తోచింది
నువ్వు కాక వేరేది కనిపించనంటోంది
ఈ ఇంద్ర జాలాన్ని నువ్వేనా చేసింది?


నీ పేరులో ఏదో వింతైన కైపుంది
నీ మాట వింటూనే ఏం తోచనీకుంది
నీ మీద ఆశేదో నను నిలువనీకుంది
మతి పోయి నేనుంటే నువ్వు .....నవ్వుకుంటావు