ఏదో, ప్రియరాగం వింటున్నా.. చిరునవుల్లో
ప్రేమా ..ఆ సందడి నీదేనా
ఏదో నవ నాట్యం చూస్తున్నా సిరిమువ్వల్లోప్రేమా .. ఆ సవ్వడి నీదేనా..
ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా
ఇటుపైన .. ఈ స్వప్నం కరిగించకు ఏమైనా
ప్రేమా , ఓ ప్రేమా , చిరకాలం నావెంటే .......
నువ్వుంటే, నిజమేగా స్వప్నం ..నువ్వుంటే, ప్రతి మాటా సత్యం
నువ్వుంటే, మనసంతా ఏదో తీయని సంగీతం
నువ్వుంటే, ప్రతి అడుగూ అందం
నువ్వుంటే , ప్రతి క్షణమూ స్వర్గం
నువ్వుంటే , జీవితమంతా ఏదో సంతోషం
పాట పాడదా మౌనం .. పూరి విప్పి ఆడదా ప్రాణం ...
అడవినైన , పూదోట చేయదా ... ప్రేమబాటలో పయనం
దారిచూపదా శూన్యం... అరచేత వాలదా స్వర్గం
ఎల్లదాటి పరవళ్ళు తోక్కదా ... వెల్లువైన ఆనందం ...
ప్రేమా నీ సావాసం ... నా శ్వాసకు సంగీతం
ప్రేమా నీ సాన్నిధ్యం నా ఊహల సామ్రాజ్యం
ప్రేమా.. ఓ ప్రేమా .. గుండెల్లో కలకాలం ....
నువ్వుంటే , ప్రతి ఆశా సొంతం..నువ్వుంటే , చిరూగాలే గంధం
నువ్వుంటే , ఎండైనా కాదా చల్లని సాయంత్రం
నువ్వుంటే , ప్రతి మాట వేదం..నువ్వుంటే, ప్రతి పలుకు రాగం
నువ్వుంటే, చిరునవ్వులతోనే నిండెను ఈ లోకం
ఉన్నచోట ఉన్నానా... ఆకశామందుకున్నానా ....
చెలియలోని ఈ కొత్త సంబరం నాకు రెక్క తొడిగేనా...
మునిగి తెలుతున్నానా .. ఈ ముచ్చటైన మురిపానా ..
ఆమెలోని ఆనంద సాగరం , నన్ను ముంచు సమయాన ...
హరివిల్లె నన్నల్లే.... ఈ రంగులు నీ వల్లే.. సిరిమల్లెల వాగల్లే ..
ఈ వెన్నెల నీవల్లే .. ప్రేమా ఓ ప్రేమా ఇది శాస్వతమనుకోనా ...
నువ్వుంటే , దిగులంటూ రాదే ... నువ్వుంటే , వెలుగంటూ పోదే ...
నువ్వుంటే , మరి మాటలు కూడా పాటైపోతాయే..
నువ్వుంటే, ఎదురంటూ లేదే ...నువ్వుంటే , అలుపంటూ రాదే ...
నువ్వుంటే, ఏ కష్టాలైనా ఎంతో ఇష్టాలే ...