Thursday, July 22, 2010

నీ నవ్వే తేనెల వానై ,నా కోసం వస్తే మధురమే ...



మధురమే మధురమే మధురమే ...
ఈ కనులకి కలలు మధురమే ...
సెలయేటికి అలలూ మధురమే ...

నీలాల మేఘం నువ్వై ...నీ నవ్వే తేనెల వానై ,
నా కోసం వస్తే మధురమే ...
నన్నే తడిపేస్తే మధురమే ....

నీకోసం నే రాసే చిరుపాటైనా మధురమే
నాకోసం నువు పలికే అరమాటైనా మధురమే

లిపిలేని సడిలేని ఆ కన్నుల బాష మధురమే
హృదయాన్ని మురిపించే ఆ సాగర ఘోష మధురమే

మధుమాసం మధురమే నీ దరహాసం మధురమే
ఉంటే నువ్వుంటే ఆ శూన్యం ఐనా మధురమే మధురమే

సఖి విడిచే శ్వాసల్లో పరిమళమెంతో మధురమే
చెలి నడిచే దారుల్లో మట్టిని తాకిన మధురమే

చెక్కిలి మెరుపు మధురమే చెలి కాటుక నలుపు మధురమే
రాల్చే కనురాల్చే ఆ కన్నీరైనా మధురమే మధురమే

మధురమే మధురమే మధురమే .....ఈ కనులకి కలలు మధురమే

Wednesday, July 21, 2010

I'm waiting for you

నీతో ఊసులాడువేళ ఈ ప్రపంచాన్ని మరచిపోతున్నా
నీవు పలకరించని నిమిషానా నాలో నేను కుమిలిపోతున్నా
నాకు ఏమైందో అన్నది తెలియక ప్రతి క్షణము సతమతమౌతున్నా
నాలోని ప్రేమను నీకు ఎలా తెలుపాలో తెలియక మౌనంగా రోదిస్తున్నా
నా మనస్సు పడే తపన నీవు తెలుసుకోవాలని క్షణ క్షణం తపిస్తున్నా
ఈ మధురయాతన తెలుసుకొని వస్తావని అనుక్షణం నీకై వేచిచూస్తున్నా

Monday, July 19, 2010

కనులు తెరిచినా కనులు మూసినా ...



కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా ..
నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా ...

ఎదుటే ఎపుడు తిరిగే వెలుగా ఇదిగో ఇపుడే చూశా సరిగా
ఇన్నాళ్ళు నేనున్నది నడి రేయి నిదురలోనా ...

పెదవుల్లో ఈ దరహాసం నీకోసం పూసింది
నీ జతలో ఈ సంతోషం పంచాలనిపిస్తోంది

ఎందుకనో మది నీకోసం ఆరాటం పడుతోంది
అయితేనేం ఆ అలజడిలో ఒక ఆనందం ఉంది ..

దూరం మహ చెడ్డదని ఈ లోకం అనుకుంటుంది
కాని ఆ దూరమే నిన్ను దగ్గరే చేసింది ...

నీలో నా ప్రాణం ఉందని ఇపుడేగా తెలిసింది
నీతో అది చెప్పిందా నీ జ్ఞాపకాలే నా ఊపిరైనవని

ప్రతి నిమిషం నా తలపంతా నీ చుట్టూ తిరిగింది
ఎవరైనా కనిపెడతారని కంగారుగ ఉంటోంది ...

నా హృదయం నీ ఊహలతో తెగ ఉరకలు వేస్తోంది
నాక్కూడా ఈ కలవరమిపుడే పరిచయమయ్యింది
అద్దంలో నా బదులు అరె నువ్వే కనిపించావే
నేనే ఇక లేనట్టు నీలో కరిగించావే ...

Friday, July 16, 2010

నిన్నే నిత్యం తలుస్తూ ...




ఒకరికొకరం ఎవరో కుడా తెలియని స్థితి నుంచి
ఒకరికోసం ఒకరం అన్న పరిస్థితి కి తెచ్చే
అద్భుతమైన బంధం...స్నేహం

కళ్యానిరాగం అంత మధురమైనది
రక్తసంబందానికి మించిన ఆత్మసంబంధం ...
.................మన ఈ స్నేహం...

ప్రేమ గుడ్డిది అనుకుంటున్నారా ...కాదు
ప్రేమకు చూపు ఉంటుంది,
అ చూపే నాకు నిన్ను చూపింది
నా హృదయాన్ని నీ వైపు నడిపింది
నిన్ను నన్ను దగ్గర చేసింది

నా "మనసంతా నువ్వే" అనేలా చేసి
"నువ్వు లేక నేను లేను" అయ్యేటట్లు చేసి
తనను తానూ నిరూపించుకుంది...


నిన్నే నిత్యం తలుస్తూ ...
నన్నే నిలువునా మరుస్తూ
నా ఆణువణువూ లో నిండిన నీ తలపులను చూసి
నాలో నేనే మురుస్తూ
నీకై నిలువెల్లా తపిస్తూ
నీలో విలీనమయ్యే రోజు కోసం వేచి చూస్తూ,,,
నిన్ను నా ప్రాణం కంటే మిన్న గా ప్రేమించే నీ......


నీ రాక కోసం
వేచి చూస్తున్న నయనానికి ఎలా చెప్పాను... నిద్రపోమని
నీ పిలుపు కోసం
పలవరిస్తున్న హృదయానికి ఎలా చెప్పాను... మానుకోమని
ఎలా చెప్పినా,ఎంత చెప్పినా,,,
నా మాట వినదే....
తన మారం ఆపదే.....

గుండెలో ఆశను తెలుపలేదు నా మౌనం
చూపులోని ఆశను చదవలేదు నీ స్నేహం
తలపులలో నీవు కొలువున్నా
కలుసుకోలేను ఎదురున్నా...
తెలిసి ఈ తప్పులు చేస్తున్నా,,
అడగవే ఒక్కసారి అయినా నేస్తమా
నీ పరిచయం కలకరిగించేటి కన్నీటి వానేనా????????

Tuesday, July 13, 2010

ఎందరి మద్యన ఉన్నా.. నీకై నేను అలోచిస్తున్నా .. ..




ఏకాంతంగా ఉన్నా ....ఎందరి మద్యన ఉన్నా.. నీకై నేను అలోచిస్తున్నా ..
ఏ పని చేస్తూ ఉన్నా ...ఎటు పయనిస్తూ ఉన్నా ...నిన్నే నేను ఆరాధిస్తున్నా ...


ఎన్నెన్నో కళ్ళు నా వైపే చూస్తూ ఉన్నా ....
నిలువెల్లా కళ్ళై నీకోసం చూస్తూ ఉన్నా ....

ఎన్నెన్నో పెదవుల పలుకులు వినిపిస్తున్నా ....
నీ పెదవుల పిలుపుల కోసం పడిచస్తున్నా ....

నా తనువంతా మనసై నేనున్నా....

రాయని లేఖలు ఎన్నో నా అరచేతుల్లో ....
ఇంకా కమ్మని సంగతులెన్నో నా యద గుండెల్లో ....

మనసైన ఆకర్షణలో మునకేస్తున్నా ....ప్రియమైన సంఘర్షణలో పులకిస్తున్నా ....
నా వయస్సంతా ....వలపై నేనున్నా........






Wednesday, July 7, 2010

నిరీక్షణ చాలని .. ఇక చాలని ..



పూత వేసిన లేత మావిని .. చూసినట్టుంది ..
నువు నవ్వుతూ ఉంటే ..

పాత పాటలు కోకిలమ్మే ..
పాడి నట్టుంది నీ పలుకు వింటుంటే ...

మాటలే వరదలై . . ఉరకలేస్తున్నవి ..
చెంత నువ్వుంటే ..

మునుపు కలుగని మురిపెమేదో ..
ముద్దుగా నా ముందరుంది ..


అలుపు తెలియని వలపు నాలో ..
హద్దులే చెరిపేయమంది ..

లేనిదేదీ నాకు లేదను తలపు ఉండేది ..
ఇంతలో నీ పరిచయం .. ఒక లోతు తెలిపింది ..

నువ్వే కావాలని ..కలవాలని ..కలగాలని ..
ప్రియా నా ప్రాణమే .. మారాము చేసింది ..

కోత కోసిన .. గుండె నాలో మిగిలి ఉంటుంది ..
నను నువు విడిచి వెళ్తుంటే ..
మాటలే మౌనమై .. ఉసురు తీస్తున్నవి .. ..

నే ఒంటరిగ ఉంటె ...

కుదురు దొరకని ఎదురు చూపే .. కొంటెగా వెంటాడ మంది ..
నిదుర కుదరని కంటి పాపే .. వెంటనే నిన్ను చూడమంది ..

ఏమిటో నా తీరు .. నాకే కొత్తగా ఉంది ..
ప్రేమ ఊసులు .. మానలేని మత్తులో ఉంది ..

నిరీక్షణ చాలని .. ఇక చాలని ..అడగాలని ..
చెలీ నా ఊపిరే .. నిన్ను చేరుకుంటుంది ..

చేతికి అందని ..చందమామే అందినట్టుంది ..
నువు తాకుతూ ఉంటె ..

చోటు ఇమ్మని .. చుక్కలేవో అడిగినట్టుంది ..

నను తోడు రమ్మంటే ..

మాటలే కవితలై .. మురిసిపోనున్నవి ..
జంట నువ్వైతే ..



Get this widget Track details eSnips Social DNA

ఎందరి మద్యన ఉన్నా.. నీకై నేను అలోచిస్తున్నా ..




ఏకాంతంగా ఉన్నా ....ఎందరి మద్యన ఉన్నా.. నీకై నేను అలోచిస్తున్నా ..
ఏ పని చేస్తూ ఉన్నా ...ఎటు పయనిస్తూ ఉన్నా ...నిన్నే నేను ఆరాధిస్తున్నా ...


ఎన్నెన్నో కళ్ళు నా వైపే చూస్తూ ఉన్నా ....
నిలువెల్లా కళ్ళై నీకోసం చూస్తూ ఉన్నా ....

ఎన్నెన్నో పెదవుల పలుకులు వినిపిస్తున్నా ....
నీ పెదవుల పిలుపుల కోసం పడిచస్తున్నా ....

నా తనువంతా మనసై నేనున్నా....

రాయని లేఖలు ఎన్నో నా అరచేతుల్లో ....
ఇంకా కమ్మని సంగతులెన్నో నా యద గుండెల్లో ....

మనసైన ఆకర్షణలో మునకేస్తున్నా ....ప్రియమైన సంఘర్షణలో పులకిస్తున్నా ....
నా వయస్సంతా ....వలపై నేనున్నా........






నీ పరిచయం కలకరిగించేటి కన్నీటి వానేనా????????

I love to walk in the rain...
ఒకరికొకరం ఎవరో కుడా తెలియని స్థితి నుంచి
ఒకరికోసం ఒకరం అన్న పరిస్థితి కి తెచ్చే
అద్భుతమైన బంధం...స్నేహం
కళ్యానిరాగం అంత మధురమైనది
రక్తసంబందానికి మించిన ఆత్మసంబంధం ..
.................మన ఈ స్నేహం...

ప్రేమ గుడ్డిది అనుకుంటున్నారా ...కాదు
ప్రేమకు చూపు ఉంటుంది,అ చూపే నాకు నిన్ను చూపింది
నా హృదయాన్ని నీ వైపు నడిపింది..నిన్ను నన్ను దగ్గర చేసింది
నా "మనసంతా నువ్వే" అనేలా చేసి.."నువ్వు లేక నేను లేను" అయ్యేటట్లు చేసి
తనను తానూ నిరూపించుకుంది...

నిన్నే నిత్యం తలుస్తూ...నన్నే నిలువునా మరుస్తూ
నా ఆణువణువూ లో నిండిన నీ తలపులను చూసి
నాలో నేనే మురుస్తూ...నీకై నిలువెల్లా తపిస్తూ
నీ రాక కోసం, వేచి చూస్తున్న నయనానికి ఎలా చెప్పాను... నిద్రపోమని...
నీ పిలుపు కోసం, పలవరిస్తున్న హృదయానికి ఎలా చెప్పాను... మానుకోమని...

ఎలా చెప్పినా,ఎంత చెప్పినా,,,నా మాట వినదే....తన మారం ఆపదే.....
గుండెలో ఆశను తెలుపలేదు నా మౌనం...చూపులోని ఆశను చదవలేదు నీ స్నేహం...
తలపులలో నీవు కొలువున్నా...కలుసుకోలేను ఎదురున్నా...
తెలిసి ఈ తప్పులు చేస్తున్నా,,..అడగవే ఒక్కసారి అయినా నేస్తమా
నీ పరిచయం కలకరిగించేటి కన్నీటి వానేనా????????

Saturday, July 3, 2010

ప్రియా ప్రియా అంటూ నా మది...




ప్రియా ప్రియా అంటూ నా మది ,
సదా నిన్నే స్మరిస్తున్నది .... సదా నిన్నే పిలుస్తున్నది....

దహించు ఏకాంతమే ....సహించ లేనన్నది ..
యుగాల ఈ దూరమే .... భరించ లేనన్నది ..

విన్నావని , వస్తావని , జవాభు ఇమ్మంటున్నది ....
కన్నీళ్ళతో ఎలా ఈదను.. నువ్వే చెప్పు ఎదుర వని నా తీరమా..
నిట్టూర్పుతో ఎలా వేగను ...నిజం కాని నా స్వప్నమా ...

ఎలా దాటాలి ఈ ఎడారిని ...ఎలా చేరాలి నా ఉగాదిని ..
క్షణం క్షణం నిరీక్షణం .... నీకై తపించుతున్నా ,స్నేహమా .....

ఏం జరుగుతుంది ....ఏం జరుగుతోంది...




ఏం జరుగుతుంది ....ఏం జరుగుతోంది... నా మనసుకు ఇవాళ ...
ఏం వెతుకుతోంది ..ఏం వెతుకుతోంది ...నా వయసు ఇవాళ..

నీ ఎదుట నిలిచే వరకు ..
ఆపదట తరిమే పరుగు .... ఏం పని అట తమతో తనకు .... తెలుసా.....

నీ వెనుక తిరిగే కనులు చూడవట వేరే కలలు ..
ఏం మాయ చేసావ్ అసలు సొగసా ..

ఆకాశమే ఆపలేని చినుకు మాదిరి
నీ కోసమే దూకుతుంది చిలిపి లాహిరి ..
ఆవేశమే ఓపలేని వేడి ఊపిరి ... నీతో సావాసమే కోరుతుంది ..ఆడుకో మరి ..

ఏం జరుగుతుంది ...ఏం జరుగుతోంది ....నా మనసుకు ఇవాళ ...

ఉండి ఉండి ఇలా ...ఉబికి వస్తున్దేమి ....కమ్మనైన కన్నీరు ..
తీయనైన గుబులు ఇది అంటే ..నమ్మేది ఎవ్వరు ?..
మధుర మైన కబురు అందిందే .. కలత పడకు బంగారు ..
పెదవితోటి చెక్కిలి నిమిరే ..చెలిమి హాజరు ..


గంగ లాగా పొంగి రానా ప్రేమ సంద్రమా ..
నీలో కరిగి అంతం అవనా ..ప్రాణ బంధమా ..


అంతు లేని దాహం అవనా ..ప్రియ ప్రవాహమా ..
నీతో కలిసి పూర్తి అవనా మొదటి స్నేహమా ..

ఏం జరుగుతుంది ....ఏం జరుగుతోంది... నా మనసుకు ఇవాళ ...

ఏం వెతుకుతోంది ..ఏం వెతుకుతోంది ...నా వయసు ఇవాళ..