Sunday, August 15, 2010

something that reminds me of you



Everyday I think of you.
Everyday you cross my mind.
Everyday I see something that reminds me of you.
Everyday I'm missing you.
Everyday I wish you were mine.
Everyday I wonder what could of been.
Everyday I think of why you did this.
& everyday I'm getting stronger.
Everyday I'm moving on.
But everyday I'll always miss you.

Saturday, August 14, 2010

నా మనసంతా నువ్వే...





చెప్పవే ప్రేమా .... చెలుని చిరునామా ....

ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా ....


మనసంతా నువ్వే .....నా మనసంతా నువ్వే...

ఇప్పుడే నువ్విలా వెల్లావనే సంగతి,గాలిలో పరిమళం నాకు చెబుతున్నది

ఎప్పుడో ఒకనాటి నిన్నని వెతికానని నువు నవ్వినా ....

ఇప్పుడూ నిను నాలో చూపగలనని .....


ఎప్పుడూ నాతోనే నువ్వున్నావని ....నేస్తమా నీకు తెలిపేదేలా ....


ఆశగా ఉందిలే ...ఈ రోజే నిను చూడాలని ....గుండెలో ఊసులే నీకు చేప్పాలని ....

నీ తలపులు ,చినుకు చినుకు గా .... దాచిన బరువెంత పెరిగినా ...

నిన్ను చేరే వరకు ఎక్కడా కరిగించను కంటి నీరుగా .....

స్నేహమా నీకు తెలిపేదేలా......
మనసంతా నువ్వే... నా మనసంతా నువ్వే...





Wednesday, August 11, 2010

నిన్ను చూడగా ...

For those who love



నిన్ను చూడగా గుండెలో ఎన్నెన్నో రాగాలు...

మనసునిండుగా మ్రోగెనులే ఏవేవో తాళాలు..

తనువంతా సంగీతం...తపనలతో సావాసం...

ఊహలలో ప్రయాణం...మేఘాల్లో సరాగం..

పరిచెయమయ్యెను కొత్త భాష..అనుభవమయ్యెను తీపి ఘోష..



నిన్ను చేరే సమయాన..పెదవే దాటని మాటలమూటలు విప్పి కళ్ళతో ఎన్నోఊసులు చెప్పెయ్యనా..

నిన్ను తలచే విరహాన.. కొంటె ఆశలు కలవరపెడితే నిజమంటి కలగా కలలో నిజమై దరిచేరనా..

ఆకాశం అందనంత దూరంలో లేదులే...జాబిల్లిలా నాముందే నువ్వుంటే..

వెన్నెల్లో హాయి పగలైనా చేరునులే..నాగమల్లిలా నువ్వు నవ్వుతుంటే...



గుండె వేగం తగ్గేనా..ఓ నిముషం పాటు నీ ఓరచూపే నా తనువుని తడిమీ కన్నుగీటుతుంటే..

కలకంటున్నాననుకున్నా.. నువ్వు కళ్ళముందున్నా పోల్చలేకున్నా నిజమే కలలాగున్నదే..

గుండెలోనే గువ్వలా దాగున్నావే...అయినా నీకోసం ఎక్కడో వెదుకులాట..

చెప్పవే మనసా నువ్వైనా నా కళ్ళకి...నీలోనే దాగున్న నాచెలి చిరునామాని

Tuesday, August 10, 2010

నేను నీ మనసులొ వున్నానని...



నిన్న నీ గురించి కలలు,

నేడు నీ గురించి ఆలోచనలు,

రేపు నీ గురించి ఆశలు,

అన్ని రోజులు నీ గురించే

వర్షాకాలం నీ ఉహలతొ తడిసిపొతున్నా,

ఎండాకాలం నీ జ్ఞాపకలతొ ఆవిరైపొతున్నా,

చలికాలం నీ ఆలొచనలతొ వణికిపొతున్నా,

అన్ని కాలాలు నీ గురించే,

ఆ నింగిలొను నీ రూపమే,

ఆ నీటిలొను నీ అందమే,

ఈ నేలలొను నీ గుర్తులే,

అన్నింటా నువ్వే, అంతటా నువ్వే,

మరి నేనెక్కడున్నానా అని వెతికాను

అప్పుడు తెలిసింది నేను నీ మనసులొ వున్నానని.

అనుభవమైతే కాని అర్థం కానిది ప్రేమ ...



అతడు ఆమె ...ఇద్దరికే చోటుందే లోకం ప్రేమ....

కాలం దూరం ఎన్నడు చేరని మరో ప్రపంచం ప్రేమ ..

ఒకరి శ్వాశ ఇంకొకరి శ్వాస గా బ్రతికిన్చేదే ప్రేమ ..

అనుభవమైతే కాని అర్థం కానిది ప్రేమ ...

Sunday, August 8, 2010

నాతొనే ఉన్నావు అనుకుంటున్నా ...


కనులు మూసి నిదురిస్తుంటే కలలో నీ జ్ఞాపకాలు
కనులు తెరిచి చూస్తే కనుల ఎదుట నీ తలపులు

పదములు ఎన్నున్నా అనుక్షణం నే పలికే పదం నీ పేరు
వర్ణములు ఎన్నున్నా క్షణ క్షణం నాకు కనిపించేది నీ రూపము

ఒంటరిగా వెళుతున్నా నాతొనే ఉన్నావు అనుకుంటున్నా నువ్వు
ఎందరితో కలిసి ఉన్న నా తలపులలో విహరిస్తున్నావు నువ్వు

చెంతలేకున్నా నా కన్నులు ప్రతిక్షణం ఎదురుచుసేను నీకై
ఏమి అయిపోతనో తెలియకున్నా వేచి ఉన్నాను నీ పిలుపుకై

Wednesday, August 4, 2010

I miss you



ప్రేమంటే“ఒక హృదయ స్పందన ని మరో హృదయం అనుభూతి చెందటం” అని.

Tuesday, August 3, 2010

అన్ని మరచి ...మళ్ళీ నీ ప్రేమకోసం ....



నింగిలోని జాబిలై ,నీకందనని నవ్వుతుంటే,
నీటినై నీ ప్రతిబింబాన్ని గుండెలో దాచుకుంటూ ఆనందిస్తున్నా. ....

అందనంత దూరంలో ఒయాసిస్సులా నీవుంటే,
గుండెనిండా ఆశలను నింపుకుంటూ బ్రతికేస్తున్నా. ....

మనసు నిండ ప్రేమనుంచుకొని కురిపించలేని మేఘంలా నీవుంటే,
నీ జ్ఞాపకాల వేడిలో బీటలుబారిని హృదయంతో ఎదురుచూస్తున్నా. ...

సంతోషాలన్ని నీలోనింపుకొని సెలయేటిలా ప్రవహిస్తున్నా,
నిలువదని తెలిసినా నా ప్రేమతో ఆనకట్ట వేసి నిన్ను ఆపాలని ఆశిస్తున్నా. ...


ప్రతిక్షణం నీ విరహం, నీ కోపం జ్ఞాపకాలై నన్ను ఏడిపిస్తున్నా ...
ఆ జ్ఞాపకం మెదిలిన మరుక్షణం అన్ని మరచి మళ్ళీ నీ ప్రేమకోసం ....

Monday, August 2, 2010

నువ్వు ఎక్కడో ఎదురవుతావని ...



నువ్వు నాతో లేవని దిగులుగా ఉన్నాను .
నేనెక్కడున్నా ప్రతినిముషం నువ్వు ఎక్కడో ఎదురవుతావని వెతుకుతున్నా,

మనసేంటో మాట వినట్లేదు,
నీ ఆలోచనలతో నా నుండి దూరం వెళ్ళిపోయింది,

ఎన్నో చెప్పాలని ఉంది,
కాని మనసు మాటకు ,పదాలు కరువయ్యాయి .

నా పెదవులు నీ పేరే పిలవాలని ఆరాటపడ్తున్నాయికాని,
నా ఎదుట నీవు లేవని మాటలని, లోపలికి నెట్టేస్తున్నాయి.

నా కన్నీళ్ళు లోపలే ఉండాలా బయటకి రావాలా అని,
నిర్ణయించుకోలెక సతమతమవుతున్నాయి,

నా చేతులు నీ స్పర్శ అందక ఒకదానితో మరోటి పెనవేసుకున్నాయి,
నా హృదయం ఆరాటపడ్తుంది , నువ్వు ఇక్కడే ఎక్కడో వున్నావని చెప్తుంది.

నీ మీద నా ప్రెమెంతో నేనెలా నేనెలా చూపించను?
కొలతలు కొలమానాలు ఏవి లేవే?

నా గుండె చప్పుడు వినేంత దగ్గరగావచ్చి చూడు ,
ఇలా ఇంకో సారి నన్ను విడిచి వెళ్ళవు . ...

నీవు పలకరించని నిమిషాన ...



నీతో ఊసులాడువేళ ఈ ప్రపంచాన్ని మరచిపోతున్నా ...
నీవు పలకరించని నిమిషాన ...నాలో నేను కుమిలిపోతున్నా ....

నాలోని ప్రేమను నీకు ఎలా తెలుపాలో తెలియక మౌనంగా రోదిస్తున్నా ..
నా మనస్సు పడే తపన నీవు తెలుసుకోవాలని క్షణ క్షణం తపిస్తున్నా ..


ఈ మధురయాతన తెలుసుకొని వస్తావని అనుక్షణం నీకై వేచిచూస్తున్నా.....

మౌనమెందుకు ... మాటాడ వెందుకు?
దూరమెందుకు ... ధరి చేరవెందుకు?

ఎద మారు మూల ఉన్న మాట దాచివుంచకు ....
ఎదురైన వేల అదుపు దాటి చేరవెందుకు .... ?

కనుల ముందు నీవున్నా ...




నా కనుల నుండి జారే కన్నీరు కాదు వేదనంటే,
కనుల ముందు నీవున్నా మనసుకి మనసుకి మద్య దూరమే
వేదనంటే....

గుండెనిండా జ్ఞాపకాలు నింపుకోని బాధపడటం కాదు
విరహమంటే, జ్ఞాపకాలు గుండెనిండినా,నిజంలో నిమిషం కూడా చేరువకాకపోవడమే
విరహమంటే. ...




నీవు దూరమై ఒంటరిగా బ్రతికేయడం కాదు
వియోగమంటే,
ఎదురుగా నీవున్నా నిన్ను పొందలేక ఎడబాటులో నీకై ఎదురుచూడటమే
వియోగమంటే. ...




నా పెదవిదాక ప్రవహించి వెనుదిరిగే భావాల అలాలు కాదు
ప్రేమంటే,
ఇరుమనసుల మద్య పరవళ్ళు తొక్కే సంతోషాల ప్రవాహం
ప్రేమంటే....
Missing You

మౌనమెందుకు ... మాటాడ వెందుకు?
దూరమెందుకు ... ధరి చేరవెందుకు?
ఎద మారు మూల ఉన్న మాట దాచివుంచకు
ఎదురైన వేల అదుపు దాటి చేరవెందుకు ....
మౌనమెందుకు ... మాటాడ వెందుకు?

Sunday, August 1, 2010

Waiting for you

నీ ప్రేమకోసం నేను పడిన వేదన,
నా ప్రేమను నీకు వ్యక్తం చెయ్యాలన్న ఆవేదన,
నీకోసం జారే ప్రతి కన్నీటిబొట్టు చూసినప్పుడు కనిపిస్తుంది,నా మదిలొని నీ ప్రేమ,
నీ కోసం కన్నీళ్ళు పెడుతున్నా ఆనందంగా ఉంటుంది,
దూరమైన నీకోసం చూసే ఎదురుచూపులోను ఆనందమే,
నీవు చెంతనున్నా ఇంత ప్రేమ కనిపించదేమో,
నీ ప్రేమ పొందాలని పడే ఆరాటం,
నిన్ను చేరువవ్వాలన్న ఆకంక్షా,
నీతో సమయాన్ని గడపాలన్న ఆలోచనలు,
అసలు ప్రేమలో కాదు ఎదురుచూడటంలోనే ఆనందముంది,

Missing You!!


మనస్సులో నీతో మాట్లాడాలని ఆరాటం
 కాని,  నువ్వెదురైతే ఆ మాటల కోసం పోరాటం, 
గుండెలొ ఎగసిపడుతుంది ప్రేమకెరటం, 
ఎలా అది నీ మనసు తీరం చేరటం.......

Thursday, July 22, 2010

నీ నవ్వే తేనెల వానై ,నా కోసం వస్తే మధురమే ...



మధురమే మధురమే మధురమే ...
ఈ కనులకి కలలు మధురమే ...
సెలయేటికి అలలూ మధురమే ...

నీలాల మేఘం నువ్వై ...నీ నవ్వే తేనెల వానై ,
నా కోసం వస్తే మధురమే ...
నన్నే తడిపేస్తే మధురమే ....

నీకోసం నే రాసే చిరుపాటైనా మధురమే
నాకోసం నువు పలికే అరమాటైనా మధురమే

లిపిలేని సడిలేని ఆ కన్నుల బాష మధురమే
హృదయాన్ని మురిపించే ఆ సాగర ఘోష మధురమే

మధుమాసం మధురమే నీ దరహాసం మధురమే
ఉంటే నువ్వుంటే ఆ శూన్యం ఐనా మధురమే మధురమే

సఖి విడిచే శ్వాసల్లో పరిమళమెంతో మధురమే
చెలి నడిచే దారుల్లో మట్టిని తాకిన మధురమే

చెక్కిలి మెరుపు మధురమే చెలి కాటుక నలుపు మధురమే
రాల్చే కనురాల్చే ఆ కన్నీరైనా మధురమే మధురమే

మధురమే మధురమే మధురమే .....ఈ కనులకి కలలు మధురమే

Wednesday, July 21, 2010

I'm waiting for you

నీతో ఊసులాడువేళ ఈ ప్రపంచాన్ని మరచిపోతున్నా
నీవు పలకరించని నిమిషానా నాలో నేను కుమిలిపోతున్నా
నాకు ఏమైందో అన్నది తెలియక ప్రతి క్షణము సతమతమౌతున్నా
నాలోని ప్రేమను నీకు ఎలా తెలుపాలో తెలియక మౌనంగా రోదిస్తున్నా
నా మనస్సు పడే తపన నీవు తెలుసుకోవాలని క్షణ క్షణం తపిస్తున్నా
ఈ మధురయాతన తెలుసుకొని వస్తావని అనుక్షణం నీకై వేచిచూస్తున్నా

Monday, July 19, 2010

కనులు తెరిచినా కనులు మూసినా ...



కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా ..
నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా ...

ఎదుటే ఎపుడు తిరిగే వెలుగా ఇదిగో ఇపుడే చూశా సరిగా
ఇన్నాళ్ళు నేనున్నది నడి రేయి నిదురలోనా ...

పెదవుల్లో ఈ దరహాసం నీకోసం పూసింది
నీ జతలో ఈ సంతోషం పంచాలనిపిస్తోంది

ఎందుకనో మది నీకోసం ఆరాటం పడుతోంది
అయితేనేం ఆ అలజడిలో ఒక ఆనందం ఉంది ..

దూరం మహ చెడ్డదని ఈ లోకం అనుకుంటుంది
కాని ఆ దూరమే నిన్ను దగ్గరే చేసింది ...

నీలో నా ప్రాణం ఉందని ఇపుడేగా తెలిసింది
నీతో అది చెప్పిందా నీ జ్ఞాపకాలే నా ఊపిరైనవని

ప్రతి నిమిషం నా తలపంతా నీ చుట్టూ తిరిగింది
ఎవరైనా కనిపెడతారని కంగారుగ ఉంటోంది ...

నా హృదయం నీ ఊహలతో తెగ ఉరకలు వేస్తోంది
నాక్కూడా ఈ కలవరమిపుడే పరిచయమయ్యింది
అద్దంలో నా బదులు అరె నువ్వే కనిపించావే
నేనే ఇక లేనట్టు నీలో కరిగించావే ...

Friday, July 16, 2010

నిన్నే నిత్యం తలుస్తూ ...




ఒకరికొకరం ఎవరో కుడా తెలియని స్థితి నుంచి
ఒకరికోసం ఒకరం అన్న పరిస్థితి కి తెచ్చే
అద్భుతమైన బంధం...స్నేహం

కళ్యానిరాగం అంత మధురమైనది
రక్తసంబందానికి మించిన ఆత్మసంబంధం ...
.................మన ఈ స్నేహం...

ప్రేమ గుడ్డిది అనుకుంటున్నారా ...కాదు
ప్రేమకు చూపు ఉంటుంది,
అ చూపే నాకు నిన్ను చూపింది
నా హృదయాన్ని నీ వైపు నడిపింది
నిన్ను నన్ను దగ్గర చేసింది

నా "మనసంతా నువ్వే" అనేలా చేసి
"నువ్వు లేక నేను లేను" అయ్యేటట్లు చేసి
తనను తానూ నిరూపించుకుంది...


నిన్నే నిత్యం తలుస్తూ ...
నన్నే నిలువునా మరుస్తూ
నా ఆణువణువూ లో నిండిన నీ తలపులను చూసి
నాలో నేనే మురుస్తూ
నీకై నిలువెల్లా తపిస్తూ
నీలో విలీనమయ్యే రోజు కోసం వేచి చూస్తూ,,,
నిన్ను నా ప్రాణం కంటే మిన్న గా ప్రేమించే నీ......


నీ రాక కోసం
వేచి చూస్తున్న నయనానికి ఎలా చెప్పాను... నిద్రపోమని
నీ పిలుపు కోసం
పలవరిస్తున్న హృదయానికి ఎలా చెప్పాను... మానుకోమని
ఎలా చెప్పినా,ఎంత చెప్పినా,,,
నా మాట వినదే....
తన మారం ఆపదే.....

గుండెలో ఆశను తెలుపలేదు నా మౌనం
చూపులోని ఆశను చదవలేదు నీ స్నేహం
తలపులలో నీవు కొలువున్నా
కలుసుకోలేను ఎదురున్నా...
తెలిసి ఈ తప్పులు చేస్తున్నా,,
అడగవే ఒక్కసారి అయినా నేస్తమా
నీ పరిచయం కలకరిగించేటి కన్నీటి వానేనా????????

Tuesday, July 13, 2010

ఎందరి మద్యన ఉన్నా.. నీకై నేను అలోచిస్తున్నా .. ..




ఏకాంతంగా ఉన్నా ....ఎందరి మద్యన ఉన్నా.. నీకై నేను అలోచిస్తున్నా ..
ఏ పని చేస్తూ ఉన్నా ...ఎటు పయనిస్తూ ఉన్నా ...నిన్నే నేను ఆరాధిస్తున్నా ...


ఎన్నెన్నో కళ్ళు నా వైపే చూస్తూ ఉన్నా ....
నిలువెల్లా కళ్ళై నీకోసం చూస్తూ ఉన్నా ....

ఎన్నెన్నో పెదవుల పలుకులు వినిపిస్తున్నా ....
నీ పెదవుల పిలుపుల కోసం పడిచస్తున్నా ....

నా తనువంతా మనసై నేనున్నా....

రాయని లేఖలు ఎన్నో నా అరచేతుల్లో ....
ఇంకా కమ్మని సంగతులెన్నో నా యద గుండెల్లో ....

మనసైన ఆకర్షణలో మునకేస్తున్నా ....ప్రియమైన సంఘర్షణలో పులకిస్తున్నా ....
నా వయస్సంతా ....వలపై నేనున్నా........






Wednesday, July 7, 2010

నిరీక్షణ చాలని .. ఇక చాలని ..



పూత వేసిన లేత మావిని .. చూసినట్టుంది ..
నువు నవ్వుతూ ఉంటే ..

పాత పాటలు కోకిలమ్మే ..
పాడి నట్టుంది నీ పలుకు వింటుంటే ...

మాటలే వరదలై . . ఉరకలేస్తున్నవి ..
చెంత నువ్వుంటే ..

మునుపు కలుగని మురిపెమేదో ..
ముద్దుగా నా ముందరుంది ..


అలుపు తెలియని వలపు నాలో ..
హద్దులే చెరిపేయమంది ..

లేనిదేదీ నాకు లేదను తలపు ఉండేది ..
ఇంతలో నీ పరిచయం .. ఒక లోతు తెలిపింది ..

నువ్వే కావాలని ..కలవాలని ..కలగాలని ..
ప్రియా నా ప్రాణమే .. మారాము చేసింది ..

కోత కోసిన .. గుండె నాలో మిగిలి ఉంటుంది ..
నను నువు విడిచి వెళ్తుంటే ..
మాటలే మౌనమై .. ఉసురు తీస్తున్నవి .. ..

నే ఒంటరిగ ఉంటె ...

కుదురు దొరకని ఎదురు చూపే .. కొంటెగా వెంటాడ మంది ..
నిదుర కుదరని కంటి పాపే .. వెంటనే నిన్ను చూడమంది ..

ఏమిటో నా తీరు .. నాకే కొత్తగా ఉంది ..
ప్రేమ ఊసులు .. మానలేని మత్తులో ఉంది ..

నిరీక్షణ చాలని .. ఇక చాలని ..అడగాలని ..
చెలీ నా ఊపిరే .. నిన్ను చేరుకుంటుంది ..

చేతికి అందని ..చందమామే అందినట్టుంది ..
నువు తాకుతూ ఉంటె ..

చోటు ఇమ్మని .. చుక్కలేవో అడిగినట్టుంది ..

నను తోడు రమ్మంటే ..

మాటలే కవితలై .. మురిసిపోనున్నవి ..
జంట నువ్వైతే ..



Get this widget Track details eSnips Social DNA

ఎందరి మద్యన ఉన్నా.. నీకై నేను అలోచిస్తున్నా ..




ఏకాంతంగా ఉన్నా ....ఎందరి మద్యన ఉన్నా.. నీకై నేను అలోచిస్తున్నా ..
ఏ పని చేస్తూ ఉన్నా ...ఎటు పయనిస్తూ ఉన్నా ...నిన్నే నేను ఆరాధిస్తున్నా ...


ఎన్నెన్నో కళ్ళు నా వైపే చూస్తూ ఉన్నా ....
నిలువెల్లా కళ్ళై నీకోసం చూస్తూ ఉన్నా ....

ఎన్నెన్నో పెదవుల పలుకులు వినిపిస్తున్నా ....
నీ పెదవుల పిలుపుల కోసం పడిచస్తున్నా ....

నా తనువంతా మనసై నేనున్నా....

రాయని లేఖలు ఎన్నో నా అరచేతుల్లో ....
ఇంకా కమ్మని సంగతులెన్నో నా యద గుండెల్లో ....

మనసైన ఆకర్షణలో మునకేస్తున్నా ....ప్రియమైన సంఘర్షణలో పులకిస్తున్నా ....
నా వయస్సంతా ....వలపై నేనున్నా........






నీ పరిచయం కలకరిగించేటి కన్నీటి వానేనా????????

I love to walk in the rain...
ఒకరికొకరం ఎవరో కుడా తెలియని స్థితి నుంచి
ఒకరికోసం ఒకరం అన్న పరిస్థితి కి తెచ్చే
అద్భుతమైన బంధం...స్నేహం
కళ్యానిరాగం అంత మధురమైనది
రక్తసంబందానికి మించిన ఆత్మసంబంధం ..
.................మన ఈ స్నేహం...

ప్రేమ గుడ్డిది అనుకుంటున్నారా ...కాదు
ప్రేమకు చూపు ఉంటుంది,అ చూపే నాకు నిన్ను చూపింది
నా హృదయాన్ని నీ వైపు నడిపింది..నిన్ను నన్ను దగ్గర చేసింది
నా "మనసంతా నువ్వే" అనేలా చేసి.."నువ్వు లేక నేను లేను" అయ్యేటట్లు చేసి
తనను తానూ నిరూపించుకుంది...

నిన్నే నిత్యం తలుస్తూ...నన్నే నిలువునా మరుస్తూ
నా ఆణువణువూ లో నిండిన నీ తలపులను చూసి
నాలో నేనే మురుస్తూ...నీకై నిలువెల్లా తపిస్తూ
నీ రాక కోసం, వేచి చూస్తున్న నయనానికి ఎలా చెప్పాను... నిద్రపోమని...
నీ పిలుపు కోసం, పలవరిస్తున్న హృదయానికి ఎలా చెప్పాను... మానుకోమని...

ఎలా చెప్పినా,ఎంత చెప్పినా,,,నా మాట వినదే....తన మారం ఆపదే.....
గుండెలో ఆశను తెలుపలేదు నా మౌనం...చూపులోని ఆశను చదవలేదు నీ స్నేహం...
తలపులలో నీవు కొలువున్నా...కలుసుకోలేను ఎదురున్నా...
తెలిసి ఈ తప్పులు చేస్తున్నా,,..అడగవే ఒక్కసారి అయినా నేస్తమా
నీ పరిచయం కలకరిగించేటి కన్నీటి వానేనా????????

Saturday, July 3, 2010

ప్రియా ప్రియా అంటూ నా మది...




ప్రియా ప్రియా అంటూ నా మది ,
సదా నిన్నే స్మరిస్తున్నది .... సదా నిన్నే పిలుస్తున్నది....

దహించు ఏకాంతమే ....సహించ లేనన్నది ..
యుగాల ఈ దూరమే .... భరించ లేనన్నది ..

విన్నావని , వస్తావని , జవాభు ఇమ్మంటున్నది ....
కన్నీళ్ళతో ఎలా ఈదను.. నువ్వే చెప్పు ఎదుర వని నా తీరమా..
నిట్టూర్పుతో ఎలా వేగను ...నిజం కాని నా స్వప్నమా ...

ఎలా దాటాలి ఈ ఎడారిని ...ఎలా చేరాలి నా ఉగాదిని ..
క్షణం క్షణం నిరీక్షణం .... నీకై తపించుతున్నా ,స్నేహమా .....

ఏం జరుగుతుంది ....ఏం జరుగుతోంది...




ఏం జరుగుతుంది ....ఏం జరుగుతోంది... నా మనసుకు ఇవాళ ...
ఏం వెతుకుతోంది ..ఏం వెతుకుతోంది ...నా వయసు ఇవాళ..

నీ ఎదుట నిలిచే వరకు ..
ఆపదట తరిమే పరుగు .... ఏం పని అట తమతో తనకు .... తెలుసా.....

నీ వెనుక తిరిగే కనులు చూడవట వేరే కలలు ..
ఏం మాయ చేసావ్ అసలు సొగసా ..

ఆకాశమే ఆపలేని చినుకు మాదిరి
నీ కోసమే దూకుతుంది చిలిపి లాహిరి ..
ఆవేశమే ఓపలేని వేడి ఊపిరి ... నీతో సావాసమే కోరుతుంది ..ఆడుకో మరి ..

ఏం జరుగుతుంది ...ఏం జరుగుతోంది ....నా మనసుకు ఇవాళ ...

ఉండి ఉండి ఇలా ...ఉబికి వస్తున్దేమి ....కమ్మనైన కన్నీరు ..
తీయనైన గుబులు ఇది అంటే ..నమ్మేది ఎవ్వరు ?..
మధుర మైన కబురు అందిందే .. కలత పడకు బంగారు ..
పెదవితోటి చెక్కిలి నిమిరే ..చెలిమి హాజరు ..


గంగ లాగా పొంగి రానా ప్రేమ సంద్రమా ..
నీలో కరిగి అంతం అవనా ..ప్రాణ బంధమా ..


అంతు లేని దాహం అవనా ..ప్రియ ప్రవాహమా ..
నీతో కలిసి పూర్తి అవనా మొదటి స్నేహమా ..

ఏం జరుగుతుంది ....ఏం జరుగుతోంది... నా మనసుకు ఇవాళ ...

ఏం వెతుకుతోంది ..ఏం వెతుకుతోంది ...నా వయసు ఇవాళ..



Tuesday, June 29, 2010

నన్ను నే మరచి నీ చెంత చేరినట్లుగా..


నా ఎద లొ ఏవో వేదనలు
నిను చూడగానే కీర్తనలు గా మారి..
నిదురించిన నా ఆశలకు
నీ ప్రేమ పలుకు తొ నిద్ర కరువయ్యేలా చేసావు…!

ఊహల పల్లకి లొ ఉర్రూతలూగి
నన్ను నే మరచి నీ చెంత చేరినట్లుగా..
పువ్వులై విరిసిన నా మనసుకి
నీ చిరునవ్వుతో సుమగంధాన్ని వెదజల్లావు…!!

గిల్లుతున్న ఈ చల్లని గాలి
నా తనువంతా పులకించే నీ పాటగా..
కాలం తొ పాటు కదిలే నన్ను
నీ జ్ఞాపకాలతో సమయమే తెలియకుండా మార్చేసావు…!!!

Sunday, June 27, 2010

నీకూ నాకూ మధ్య...




నీకూ నాకూ మధ్య...

వేకువన వచ్చే ఉషాకిరణాలు...
సంధ్యలు పంచే చీకటి దొంతరలు...
ఎంత విభిన్నం పగలూ, రాత్రీ...!
కానీ ఆ రెండిటి సంగమం ఎప్పటికీ అపూర్వమే...!

ఆమెకోసం వెలుగు చూపుల్తో పరుగున వచ్చే ఉదయుడు అతనై...
అతని రాకకై వేయి కళ్ళతో ఎదురుచూసే నిశికాంత ఈమైతే...

Tuesday, June 15, 2010

నా గతాలనే కవ్వింతలై పిలుస్తు ఉంటే ...



నిజంగా నేనేనా .....ఇలా నీ జతలో ఉన్నా ....
ఇదంతా ప్రేమేనా.... ఎన్నో వింతలు చూస్తున్నా ....

యదలో ఎవరో చేరి ...అన్నీ చేస్తున్నారా ....
వెనకే వెనకే ఉంటూ ...నీపై నన్నే తోస్తున్నారా .....

హరే హరే హరే హరే హరేరామా ...
మరీ ఇలా ఎలా వచ్చేసింది ధీమా ....
ఎంతో హుషారుగా ఉన్నాదే లోలోనా ....ఏమ్మా ....

ఈ వయస్సులో ఒకో క్షణం ఒకో వసంతం....నా మనస్సుకే ప్రతీక్షణం నువ్వే ప్రపంచం
ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం ....

అడుగులలోనా అడుగులు వేస్తూ నడిచిన దూరం ఎంతో ఉన్నా ...
అలసట రాదు గడచిన కాలం ఇంతని నమ్మనుగా ....

నా కలే ఇలా నిజాలుగా నిలుస్తు ఉంటే ...
నా గతాలనే కవ్వింతలై పిలుస్తు ఉంటే ...
ఈ వరాలుగా ఉల్లాసమే కురుస్తు ఉంటే ...

నిజంగా ఇది నేనేనా .....

మధురమే మధురమే మధురమే
కనులకి కలలు మధురమే
సెలయేటికి అలలూ మధురమే



నీలాల మేఘం నువ్వై నీ నవ్వే తేనెల వానై
నా కోసం వస్తే మధురమే
నన్నే తడిపేస్తే మధురమే




నీకోసం నే రాసే చిరుపాటైనా మధురమే
నాకోసం నువు పలికే అరమాటైనా మధురమే



లిపిలేని సడిలేని కన్నుల బాష మధురమే
హృదయాన్ని మురిపించే సాగర ఘోష మధురమే
మధుమాసం మధురమే నీ దరహాసం మధురమే



ఉంటే నువ్వుంటే శూన్యం ఐనా మధురమే మధురమే

సఖి విడిచే శ్వాసల్లో పరిమళమెంతో మధురమే
చెలి నడిచే దారుల్లో మట్టిని తాకిన మధురమే
ఉదయాన ఉదయించే సూర్యుడు ఎరుపు మధురమే
రేయంతా వికసించే వెన్నెల తెలుపు మధురమే
చెక్కిలి మెరుపు మధురమే చెలి కాటుక నలుపు మధురమే
రాల్చే కనురాల్చే కన్నీరైనా మధురమే మధురమే
మధురమే మధురమే మధురమే
కనులకి కలలు మధురమే
సెలయేటికి అలలూ మధురమే
నీలాల మేఘం నువ్వై నీ నవ్వే తేనెల వానై
నా కోసం వస్తే మధురమే
.. నన్నే తడిపేస్తే మధురమే
madhuramE madhuram

చేజారి వెళ్ళిపోతోంది మనసలా ....



ఏమయిందో గాని చూస్తూ చూస్తూ చేజారి వెళ్ళిపోతోంది మనసలా ....
ఏం మాయ వల వేస్తూ వేస్తూ ఏ దారి లాగుతూ ఉందో తననలా ...


అదుపులో ఉండదే చెలరేగే చిలిపితనం ...అటు ఇటు చూడదే గాలిలో తేలిపోవటం ...
అనుమతి కోరదే పడిలేచే పెంకితనం ...అడిగినా చెప్పదే ఎమిటో అంత అవసరం ...

తప్పో ఎమో అంటుంది... తప్పదు ఎమో అంటుంది ..తడబాటు తేలని నడక ...
కోరే తీరం ముందుంది ..చేరాలంటే చేరాలి కదా ..బెదురుతు నిలబడకా ..
చినుకంత ముద్దు తనకందిస్తే చాలు అంతే అందిగా తెలుసా ...


ఏం మాయ వల వేస్తూ వేస్తూ ఏ దారి లాగుతూ ఉందో తననలా ...
ఓసారి ప్రేమించాక ఓసారి మనసిచ్చాక మరుపంటూ రానేరాదమ్మా

ఓసారి కలగన్నాక ఊహల్లో కలిసున్నాక విడిపోయే వీలే లేదమ్మా

నీ కళ్ళల్లోనా కన్నీటి జల్లుల్లోనా

ఆరాటాలే ఎగసి అణువు అణువు తడిసి ఇంకా ఇంకా బిగిసిందీ ప్రేమా
కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా ..
నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా ...



ఎదుటే ఎపుడు తిరిగే వెలుగా ఇదిగో ఇపుడే చూశా సరిగా
ఇన్నాళ్ళు నేనున్నది నడి రేయి నిదురలోనా ...




పెదవుల్లో దరహాసం నీకోసం పూసింది
నీ జతలో సంతోషం పంచాలనిపిస్తోంది
ఎందుకనో మది నీకోసం ఆరాటం పడుతోంది
అయితేనేం అలజడిలో ఒక ఆనందం ఉంది ..
దూరం మహ చెడ్డదని లోకం అనుకుంటుంది
కాని దూరమే నిన్ను దగ్గరే చేసింది ...



నీలో నా ప్రాణం ఉందని ఇపుడేగా తెలిసింది
నీతో అది చెప్పిందా నీ జ్ఞాపకాలే నా ఊపిరైనవని

ప్రతి నిమిషం నా తలపంతా నీ చుట్టూ తిరిగింది
ఎవరైనా కనిపెడతారని కంగారుగ ఉంటోంది
నా హృదయం నీ ఊహలతో తెగ ఉరకలు వేస్తోంది
నాక్కూడా కలవరమిపుడే పరిచయమయ్యింది
అద్దంలో నా బదులు అరె నువ్వే కనిపించావే
నేనే ఇక లేనట్టు నీలో కరిగించావే
ప్రేమా కొత్త స్వరం అని అనుమానం కలిగింది
నువ్వే నా సందేహానికి వెచ్చనైన రుజువియ్యమంది మది
కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా
నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా
ఎదుటే ఎపుడు తిరిగే వెలుగా ఇదిగో ఇపుడే చూశా సరిగా
ఇన్నాళ్ళు నేనున్నది నడి రేయి నిదురలోనా
ఐతే నాకినాడే తొలిపొద్దు జాడ తెలిసింద కొత్త

Monday, June 14, 2010

ఉప్పెనంత ఈ ప్రేమకి ...



ఉప్పెనంత ఈ ప్రేమకి ...గుప్పెడంత గుండె ఏమిటో.....
చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో.....


తియ్యనైన ఈ బాధకి ఉప్పునీరు కంట దేనికో ....
రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో ....

నిన్ను చూసే ఈ కళ్ళకీ లోకమంత ఇంక ఎందుకో ...
రెండు అక్షరాల ప్రేమకీ ఇన్ని శిక్షలెందుకో ...

ఐ లవ్ యు…నా ఊపిరి ఆగిపోయినా ....
ఐ లవ్ యు.. నా ప్రాణం పోయినా ....

గుండెల్లో నిండున్నావు ....



నేస్తం నీవు ...నా ప్రేమవి నీవు ....
గుండెల్లో నిండున్నావు ....గుప్పెట్లో దాగున్నావు ....
చీకట్లో వెలుగిస్తావు జగమంతా కనిపిస్తావు ....


పండుగ నీవు ...నా పచ్చిక నీవు ....
శూన్యం నీవు ...నా శోకం నీవు ....


వెచ్చని వేకువై వెలిగిరావా ...మాటతో రూపమై తరలిరావా ....
నీ శ్వాస కోసం మానై ఉంటా ...నీ చూపు కోసం శిలనై ఉంటా ....


నీ తోడు కోసం ఆవిరైపోనా ...నీ స్పర్శ కోసం చినుకైరానా....
నీ గుండెలోకి సడినై రానా ...


నేస్తం నీవు ...నా ప్రాణం నీవు ....


నా గతలనే కవ్వింతలై పిలుస్తు ఉంటే ...



నిజంగా నేనేనా .....ఇలా నీ జతలో ఉన్నా ....
ఇదంతా ప్రేమేనా.... ఎన్నో వింతలు చూస్తున్నా ....

యదలో ఎవరో చేరి ...అన్నీ చేస్తున్నారా ....
వెనకే వెనకే ఉంటూ ...నీపై నన్నే తోస్తున్నారా .....

హరే హరే హరే హరే హరేరామా ...
మరీ ఇలా ఎలా వచ్చేసింది ధీమా ....
ఎంతో హుషారుగా ఉన్నాదే లోలోనా ....ఏమ్మా ....

ఈ వయస్సులో ఒకో క్షణం ఒకో వసంతం....నా మనస్సుకే ప్రతీక్షణం నువ్వే ప్రపంచం
ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం ....

అడుగులలోనా అడుగులు వేస్తూ నడిచిన దూరం ఎంతో ఉన్నా ...
అలసట రాదు గడచిన కాలం ఇంతని నమ్మనుగా ....

నా కలే ఇలా నిజాలుగా నిలుస్తు ఉంటే ...
నా గతలనే కవ్వింతలై పిలుస్తు ఉంటే ...
ఈ వరాలుగా ఉల్లాసమే కురుస్తు ఉంటే ...

నిజంగా ఇది నేనేనా .....

మొదటిసారి మదిని చేరి ...

మొదటిసారి మదిని చేరి ...నిదర లేపిన హృదయమా
వయసులోని పసితనాన్ని పలకరించిన ప్రణయమా
మరి కొత్తగా మరో పుట్టుక అనేటట్టుగా ఇది నీ మాయేనా
నేనని నీవనీ వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైనా

అంతా నీ మాయలోనే ...



నీ కోసం దిగిరానా ...నేనెవరో మరిచి ...
నీ వల్లే కదలనా ..నీ నీడల్లే మారనా ....


నాకోసం నేను లేనా ...మనసంతా నువ్వేనా ...
ప్రేమంటే ఇంతేనా ...


అరెరే అరెరే నా మనసే జారే ... అరెరే అరెరే ఈ వరసే మారే ..
ఇది వరకెపుడూ లేదే ...ఇది నా మనసే కాదె ..

ఎవరే మన్నా వినదే ...తన దారేదో తన దే ...
అంతా నీ మాయలోనే ...రోజూ నీ నామ స్మరణే ...

ప్రేమా ఈ వింత లన్నీ నీ వల్లనే ......

Thursday, June 10, 2010

మొదటిసారి మదిని చేరి ...



మొదటిసారి మదిని చేరి ...నిదర లేపిన హృదయమా ...
వయసులోని పసితనాన్ని ...పలకరించిన ప్రణయమా ....

మరీ కొత్తగా ..మరో పుట్టుక అనేటట్టుగా ఇది నీ మాయేనా ....
నేనని ...నీవనీ .....వేరుగా లేమని ...చెప్పినా వినరా ఒకరైనా....

మరుపురాని నీ ప్రేమే మధుర జ్ఞాపకం ...



ఏదో ఒకరాగం పిలిచిందీ వేళ ...
ఎదలో నిదురించే కధలెన్నో కదిలేలా ...

నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా ...
నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా ...

జ్ఞాపకాలే మైమరపు జ్ఞాపకాలే మేలుకొలుపు ...
జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు ...

వీచే గాలులలో నీ ఊసులు జ్ఞాపకమే ...
పూచే పూవులలో నీ నవ్వులు జ్ఞాపకమే ...

మెరిసే తారలలో నీ చూపుల జ్ఞాపకమే ...
ఎగసే ప్రతి అలలో నీ ఆశల జ్ఞాపకమే ...

పెదవిపైన నీ పేరే చిలిపి జ్ఞాపకం ...
మరుపురాని నీ ప్రేమే మధుర జ్ఞాపకం ...

Wednesday, June 9, 2010

ప్రియతమా ఓ ప్రియతమా ....



ప్రియతమా ఓ ప్రియతమా .....
ఈ మౌన రాగాలనే పలికే హృదయం .....
నిన్ను చూడాలని ఓ మాటా చెప్పాలనీ .....

కలవరిస్తోందనీ తెలుసా .....

ఎప్పుడో అపుడెప్పుడో ముడి పడిన ఈ బంధమేదో .....
ఇప్పుడే ఇప్పు డి ప్పుడే నీ మనసు చెప్పింది నాతొ .....
వాన విల్లు ఏదో మెరిసిందలా .....
పూల జల్లు నాపై కురిసిందిలా .....
రాగమో అనురాగమో ఈ వింత మాయ నేమంటారో.....

గుట్టుగా కనిపెట్టగా మనసంత నీ సంతకాలే .....
మత్తుగా గమ్మతుగా ఎద నిండా నీ జ్ఞాపకాలే .....
నిన్ను చూడకుండా మనసున్దదే .....
నిన్ను చూసినాక కునుకుండదే .....
మోహమో వ్యామోహమో ఈ వింత మాయ నేమంటారో.....

ప్రియతమా ఓ ప్రియతమా .....
ఈ మౌనరాగాలనే పలికే హృదయం .....
నిన్ను చేరిందని తన మనసు విప్పిందని.....
i love u అంటోందని తెలుసా .....

Tuesday, June 8, 2010

మదికి ఇంక కుదురేదే...





చిన్న పోలికే లేదు ప్రేమా ..... నిన్న కీ నేటి కీ ...
చిలిపి కోరికే ఎందుకమ్మా .... చీటికి మాటికి ..
జంటగా జంట గా నువ్వు కలిసాక ..
ఇంతగా ఇంతగా చేరువవుతున్నాగా ..

ఊగుతూ ఊగుతూ ఈ ఊహనే ...ఉలిక్కి పడుతుంటే...

మదికి ఇంక కుదురేదే .....

The Distance.....



When it hurts so bad,
why does it feel so good?
I wish this all made sense,
I wish I understood.
Not having you here with me is tearing me up inside,
but I can't stop thinking about you no matter how hard i try.

You know how i feel about you,
and I know I want to spend most of my time with you
but it's so hard to do when I can't even be next to you
Why does it gotta be so complictaed?

Loving you feels so right,
but at the same time,
knowing I can't have you keeps me awake at night.
I just want this to be simple,
I just want you here with me,
to look into your eyes,
be held in your arms....then I'd truly be happy.

Right nowthis distance between us is out of our control,
but I'm still hoping one day soon,
I'll get what I'm wishing for.

నీవు లేని వేళ నాకు.....



నీవు లేని వేళ నాకు క్షణమే యుగమా.....

చేయి ధాటి జారిపోయే కధలే నిజమా..

విరిసే మదినీ... విరిచే ప్రేమా ....

ఎడ బాటేనా ..నీ చిరునామా....


నను చేరే శ్వాసా... నాతో వేరవుతుంటే....

నడిచే ఓ శిలగా నైనా జీవించాలా..

ఇక సెలవని ఇరు హృదయాలు .....

గతమే ఒక కల అనుకోవాలా...


గతం అంతా నీతో సాగిన దారుల్లోనా...

మన పాదం చూపే గురుతే శోధిస్తున్నా ....

తొలి వలపుకు ఆఖరి మజిలి కలవని ఇరు తీరాలైతే ..

మనసులు ఒక జంటగా చేరి వలచేది ఎందుకో..


బ్రతికే వరకు తొలిచే ప్రేమా... చితిలోనైనా కలిసుంటామా .....

నీవు లేని వేళ నాకు క్షణమే యుగమా.....









Monday, June 7, 2010

నిన్నే నిన్నే కోరా ..



నిన్నే నిన్నే కోరా .. నిన్నే నిన్నే చేరా ...
నిరంతరం నీ ధ్యానం లో...నన్నే మరిచా ..

ప్రతీ జన్మలో నా ....నీతో ప్రేమ లోనా...
ఇలా ఉండిపోనా ఓ ప్రియతమా ..
నచ్చావే .. నచ్చావే .. నచ్చావులే...

అనుకుని అనుకోగానే ...సరాసరి ఎదురుతావు
వేరే పనే లేదా నీకు ....నన్నే వదలవు ..

నువ్వు నాకు ఎందుకింత ...ఇష్టం అంటే చెప్పలేను
మరువలేను నిన్ను నేను ...గుర్తు రానే నాకు నేను

నీ మైకం కమ్ముకుంది ..ఈరోజే నన్నిలా ....
ఈలోకం కొత్తగుందీ ...సీత కోక లాగా ..

నీతో ఏదో చెప్పాలంటూ... పదే పదే అనిపిస్తుంది..
పెదాలలో మౌనం నన్నే ఆపెస్తున్నది..


మనసునేమో దాచ మన్నా...అస్సలేమి దాచుకోదు
నిన్ను చూస్తే పొద్దు పోదు ...చూడకుంటే ఆశ పోదు


ఈ వైనం ఇంత కాలం ...నా లోనే లేదుగా
నువ్వు చేసే ఇంద్రజాలం .. భరించేదేలాగా ..


నచ్చావే .. నచ్చావులే...

కమ్మని ప్రేమలో ..



తియ తీయని కలలను కనడమే తెలుసు కమ్మని ప్రేమలో ..
మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో ...


ఎన్నాళ్లయినా నేనుండి పోగలను ... నీ కౌగిళ్ళలో ..
నేనేవరన్నది నే మరచిపోగలను ... చూస్తూ నీ కళ్లలో

చల చల్లని మంచుకి అర్ధమే కాదు ప్రేమ చలవేమిటో ....

నునువెచ్చని మంటలు ఎరగ వేనాడు ప్రేమ సేగలేమిటో ..


వచ్చీ రానీ కన్నీరు కే తెలుసు ప్రేమ లోతేమిటో ...
ముద్దే లేని అధరాలకే తెలుసు ఈడు బాధేమిటో ...

మురిపెం తో సరసం తీర్చ మంటోంది ప్రాయమీ వేళలో ...
తమకం తో దూరం తెంచ మంటోంది ..తీపి చెరసాలలో ...


విరహం తో పరువం కరిగిపోతుంది ఆవిరై గాలిలో ...
కలిసుంటే కాలం నిలిచిపోతుంది ప్రేమ సంకెళ్ళలో ....


తియ తీయని కలలను కనడమే తెలుసు కమ్మని ప్రేమలో ..

Friday, June 4, 2010

ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని ....



ప్రియతమా తెలుసునా ...నా మనసు నీదేనని ....
హృదయమా తెలుపనా.... నీకోసమే నేనని ....
కనుపాపలో రూపమే నీవని ....
కనిపించని భావమే ప్రేమని ....

ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా

చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన

నా ఉపిరితో జీవించేటి ఓ చంటి ఐ లవ్ యు రా

నిన్నే తలచి నన్నే మరిచా ఓ కన్నా ఐ లవ్ యు రా

కను రాల్చే కన్నీరువా నను చేరే పన్నీరువా

నీ యద చాటు వలపెంతో తెలిసిందిరా

ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా

చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన



కన్నులలోనా వెన్నెలలోనా నీ రూపు తోచే

ఊహలలోనా ఊసులలోనా నీ ఆశలే నాలో నీ బాసలే

తొలిసారిట సిగ్గేస్తుంది మొగ్గేస్తుంది తనువంతా

అపుడపుడు తడిమేస్తోంది తడిపేస్తోంది మధువుల వాన

ఆనందమై నాలో అనుబంధమై నీ ప్రేమ నను చేరి వణికించెరా

ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా

చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన



ఉదయించే అరుణం నేనై నిను చేరుకోనా

వికసించే కుసుమం నేనై నిను తాకనా నీలో సడి చేయనా

పని చేస్తే పక్కన చేరి సందడి చేస్తూ గుసగుసలే

పడుకుంటే అల్లరి చేస్తూ నను లాగేస్తూ తుంటరి కలలే

సంగీతమై నాలో సంతోషమై నీ ప్రేమా కనువిందు పండించెరా

ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా

చిత్రంగా కురిసింది మదిలో మల్లెల వాన

నా ఉపిరితో జీవించేటి ఓ చంటి ఐ లవ్ యు రా

నిన్నే తలచి నన్నే మరిచా ఓ కన్నా ఐ లవ్ యు రా

కను రాల్చే కన్నీరువా నను చేరే పన్నీరువా

నీ యద చాటు వలపెంతో తెలిసిందిరా



Wednesday, June 2, 2010

ఏదో ఏదో అయిపోతుంది ...



ఏదో ఏదో అయిపోతుంది ... ఎదలో ఏదో మొదలయ్యింది ..
నిన్నే చూడాలని ...నీతో ఉండాలని ..
నేనే ఓడాలని ..నువ్వే గెలవాలని ..
పదే పదే అనిపిస్తుంది ..నీ పిలుపే వినిపిస్తుంది ..

కళ్ళేమో కలలు మాని , నిన్ను వెతుకుతుంటే ,
మనసేమో పనులు మాని, నిన్ను  తలచుకుంటే ,,
కాళ్ళు నీతో కలిసి నడవాలని కలవరపెడుతుంటే ,
చేయి నీతో చెలిమే చెయ్యాలని తొందరపెడుతుంటే ,

ఆరాటం హద్దు దాటి, మాట చెప్పమంటే ,
ఉత్షాహం నిన్నే, పొందాలని ఉరకలు వేస్తుంటే ,
ఉల్లాసం నీకే చెందాలని పరుగులు తీస్తుంటే


నువ్వే కావాలని , నిన్నే గెలవాలని ,
మనసే విప్పాలని , మాటే చెప్పాలని ,
అది ప్రేమో ఏమో తెలియని వింత యాతన ,
అది ప్రేమేనేమో ఎరుగని కొంటె భావన .