
పాదమెటు పోతున్నా- పయనమెందాకైనా..
అడుగు తడబడుతున్నా- తోడురానా..
అడుగు తడబడుతున్నా- తోడురానా..
చిన్ని ఎడబాటైనా- కంటతడి పెడుతున్నా..
గుండె ప్రతి లయలోన- నేను లేనా!..
ఒంటరైనా- ఓటమైనా..వెంటనడిచే- నీడ నీవే ..
ఓ- మై ఫ్రెండ్..తడి కన్నులనే తుడిచిన నేస్తమా!..
ఓ- మై ఫ్రెండ్..ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా!..
అమ్మ ఒడిలో- లేని పాశం..నేస్తమల్లే- అల్లుకుందీ..
జన్మకంతా- తీరిపోనీ-మమతలెన్నో- పంచుతుందీ..
మీరు మీరూ నుంచీ- మన స్నేహగీతం..
ఏరా యేరాల్లోకి మారే..మొహమాటలేవీ- కలే జాలువారే!
నిన్ను చూస్తే- చిన్ననాటి..చేతలన్నీ- చెంతవాలే..
గిల్లి కజ్జాలెన్నో- ఇలా పెంచుకుంటూ..తుళ్ళింతల్లో- తేలే స్నేహం..
మొదలో- తుదలో, తెలిపే.. ముడి వీడకుందే..
ఓ- మై ఫ్రెండ్..ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా!..