Sunday, March 14, 2010

వింటున్నావా వింటున్నావా ....



పలుకులు నీ పేరే తలుచుకున్నా ..
పెదవుల అంచుల్లో అణుచుకున్నా ...
మౌనంతో నీ మదిని బంధించా ....మన్నించు ప్రియా…

తరిమే వరమా ...తడిమే స్వరమా.. ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా వింటున్నావా వింటున్నావా ....

విన్నా వేవేళ వీణల సంతోషాల సంకీర్తనలు నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా .....
తొలిసారి నీ మాటల్లో పులకింతల పదనిసలు విన్నా ....


చాలు చాలే చెలియా చెలియా బ్రతికుండగా నీ పిలుపులు నేను విన్నా
ఓ… బ్రతికుండగానే పిలుపులు నేను విన్నా

ఏమో ఏమో ఏమవుతుందో ఏవేమైనా నువ్వే చూసుకో
విడువను నిన్నే ఇకపైనా వింటున్నావా ప్రియా

ఆద్యంతం ఏదో అనుభూతి ..అనవరతం ఇలా అందించేది ..
గగనం కన్నా మునుపటిది ..భూతలం కన్నా వెనుకటిది ..
కాలంతోనా పుట్టింది ...కాలంలా మారే మనసే లేనిది ప్రేమా ...

రా ఇలా కౌగిళ్ళలో నిన్ను దాచుకుంటా
నీదానినై నిన్నే దారి చేసుకుంటా
ఎవరిని కలువని చోటులలోన ....ఎవరిని తలువని వేళలలోనా ...