Monday, July 19, 2010

కనులు తెరిచినా కనులు మూసినా ...



కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా ..
నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా ...

ఎదుటే ఎపుడు తిరిగే వెలుగా ఇదిగో ఇపుడే చూశా సరిగా
ఇన్నాళ్ళు నేనున్నది నడి రేయి నిదురలోనా ...

పెదవుల్లో ఈ దరహాసం నీకోసం పూసింది
నీ జతలో ఈ సంతోషం పంచాలనిపిస్తోంది

ఎందుకనో మది నీకోసం ఆరాటం పడుతోంది
అయితేనేం ఆ అలజడిలో ఒక ఆనందం ఉంది ..

దూరం మహ చెడ్డదని ఈ లోకం అనుకుంటుంది
కాని ఆ దూరమే నిన్ను దగ్గరే చేసింది ...

నీలో నా ప్రాణం ఉందని ఇపుడేగా తెలిసింది
నీతో అది చెప్పిందా నీ జ్ఞాపకాలే నా ఊపిరైనవని

ప్రతి నిమిషం నా తలపంతా నీ చుట్టూ తిరిగింది
ఎవరైనా కనిపెడతారని కంగారుగ ఉంటోంది ...

నా హృదయం నీ ఊహలతో తెగ ఉరకలు వేస్తోంది
నాక్కూడా ఈ కలవరమిపుడే పరిచయమయ్యింది
అద్దంలో నా బదులు అరె నువ్వే కనిపించావే
నేనే ఇక లేనట్టు నీలో కరిగించావే ...