
పూత వేసిన లేత మావిని .. చూసినట్టుంది ..
నువు నవ్వుతూ ఉంటే ..
పాత పాటలు కోకిలమ్మే ..
పాడి నట్టుంది నీ పలుకు వింటుంటే ...
మాటలే వరదలై . . ఉరకలేస్తున్నవి ..
చెంత నువ్వుంటే ..
మునుపు కలుగని మురిపెమేదో ..
ముద్దుగా నా ముందరుంది ..
అలుపు తెలియని వలపు నాలో ..
హద్దులే చెరిపేయమంది ..
లేనిదేదీ నాకు లేదను తలపు ఉండేది ..
ఇంతలో నీ పరిచయం .. ఒక లోతు తెలిపింది ..
నువ్వే కావాలని ..కలవాలని ..కలగాలని ..
ప్రియా నా ప్రాణమే .. మారాము చేసింది ..
కోత కోసిన .. గుండె నాలో మిగిలి ఉంటుంది ..
నను నువు విడిచి వెళ్తుంటే ..
మాటలే మౌనమై .. ఉసురు తీస్తున్నవి .. ..
నే ఒంటరిగ ఉంటె ...
కుదురు దొరకని ఎదురు చూపే .. కొంటెగా వెంటాడ మంది ..
నిదుర కుదరని కంటి పాపే .. వెంటనే నిన్ను చూడమంది ..
ఏమిటో నా తీరు .. నాకే కొత్తగా ఉంది ..
ప్రేమ ఊసులు .. మానలేని మత్తులో ఉంది ..
నిరీక్షణ చాలని .. ఇక చాలని ..అడగాలని ..
చెలీ నా ఊపిరే .. నిన్ను చేరుకుంటుంది ..
చేతికి అందని ..చందమామే అందినట్టుంది ..
నువు తాకుతూ ఉంటె ..
చోటు ఇమ్మని .. చుక్కలేవో అడిగినట్టుంది ..
నను తోడు రమ్మంటే ..
మాటలే కవితలై .. మురిసిపోనున్నవి ..
జంట నువ్వైతే ..
|