
నీతో ఊసులాడువేళ ఈ ప్రపంచాన్ని మరచిపోతున్నా ...
నీవు పలకరించని నిమిషాన ...నాలో నేను కుమిలిపోతున్నా ....
నీవు పలకరించని నిమిషాన ...నాలో నేను కుమిలిపోతున్నా ....
నాలోని ప్రేమను నీకు ఎలా తెలుపాలో తెలియక మౌనంగా రోదిస్తున్నా ..
నా మనస్సు పడే తపన నీవు తెలుసుకోవాలని క్షణ క్షణం తపిస్తున్నా ..
ఈ మధురయాతన తెలుసుకొని వస్తావని అనుక్షణం నీకై వేచిచూస్తున్నా.....
మౌనమెందుకు ... మాటాడ వెందుకు?
దూరమెందుకు ... ధరి చేరవెందుకు?
ఎద మారు మూల ఉన్న మాట దాచివుంచకు ....
ఎదురైన వేల అదుపు దాటి చేరవెందుకు .... ?