Monday, June 14, 2010

గుండెల్లో నిండున్నావు ....



నేస్తం నీవు ...నా ప్రేమవి నీవు ....
గుండెల్లో నిండున్నావు ....గుప్పెట్లో దాగున్నావు ....
చీకట్లో వెలుగిస్తావు జగమంతా కనిపిస్తావు ....


పండుగ నీవు ...నా పచ్చిక నీవు ....
శూన్యం నీవు ...నా శోకం నీవు ....


వెచ్చని వేకువై వెలిగిరావా ...మాటతో రూపమై తరలిరావా ....
నీ శ్వాస కోసం మానై ఉంటా ...నీ చూపు కోసం శిలనై ఉంటా ....


నీ తోడు కోసం ఆవిరైపోనా ...నీ స్పర్శ కోసం చినుకైరానా....
నీ గుండెలోకి సడినై రానా ...


నేస్తం నీవు ...నా ప్రాణం నీవు ....