
గుండెనిండా జ్ఞాపకాలు నింపుకోని బాధపడటం కాదు
విరహమంటే, జ్ఞాపకాలు గుండెనిండినా,నిజంలో నిమిషం కూడా చేరువకాకపోవడమే
విరహమంటే. ...
నీవు దూరమై ఒంటరిగా బ్రతికేయడం కాదు
వియోగమంటే,
ఎదురుగా నీవున్నా నిన్ను పొందలేక ఎడబాటులో నీకై ఎదురుచూడటమే
వియోగమంటే. ...
నా పెదవిదాక ప్రవహించి వెనుదిరిగే భావాల అలాలు కాదు
ప్రేమంటే,
ఇరుమనసుల మద్య పరవళ్ళు తొక్కే సంతోషాల ప్రవాహం
ప్రేమంటే....