
నువ్వు నాతో లేవని దిగులుగా ఉన్నాను .
నేనెక్కడున్నా ప్రతినిముషం నువ్వు ఎక్కడో ఎదురవుతావని వెతుకుతున్నా,
నేనెక్కడున్నా ప్రతినిముషం నువ్వు ఎక్కడో ఎదురవుతావని వెతుకుతున్నా,
మనసేంటో మాట వినట్లేదు,
నీ ఆలోచనలతో నా నుండి దూరం వెళ్ళిపోయింది,
ఎన్నో చెప్పాలని ఉంది,
కాని మనసు మాటకు ,పదాలు కరువయ్యాయి .
నా పెదవులు నీ పేరే పిలవాలని ఆరాటపడ్తున్నాయికాని,
నా ఎదుట నీవు లేవని మాటలని, లోపలికి నెట్టేస్తున్నాయి.
నా కన్నీళ్ళు లోపలే ఉండాలా బయటకి రావాలా అని,
నిర్ణయించుకోలెక సతమతమవుతున్నాయి,
నా చేతులు నీ స్పర్శ అందక ఒకదానితో మరోటి పెనవేసుకున్నాయి,
నా హృదయం ఆరాటపడ్తుంది , నువ్వు ఇక్కడే ఎక్కడో వున్నావని చెప్తుంది.
నీ మీద నా ప్రెమెంతో నేనెలా నేనెలా చూపించను?
కొలతలు కొలమానాలు ఏవి లేవే?
నా గుండె చప్పుడు వినేంత దగ్గరగావచ్చి చూడు ,
ఇలా ఇంకో సారి నన్ను విడిచి వెళ్ళవు . ...