Wednesday, June 2, 2010

ఏదో ఏదో అయిపోతుంది ...



ఏదో ఏదో అయిపోతుంది ... ఎదలో ఏదో మొదలయ్యింది ..
నిన్నే చూడాలని ...నీతో ఉండాలని ..
నేనే ఓడాలని ..నువ్వే గెలవాలని ..
పదే పదే అనిపిస్తుంది ..నీ పిలుపే వినిపిస్తుంది ..

కళ్ళేమో కలలు మాని , నిన్ను వెతుకుతుంటే ,
మనసేమో పనులు మాని, నిన్ను  తలచుకుంటే ,,
కాళ్ళు నీతో కలిసి నడవాలని కలవరపెడుతుంటే ,
చేయి నీతో చెలిమే చెయ్యాలని తొందరపెడుతుంటే ,

ఆరాటం హద్దు దాటి, మాట చెప్పమంటే ,
ఉత్షాహం నిన్నే, పొందాలని ఉరకలు వేస్తుంటే ,
ఉల్లాసం నీకే చెందాలని పరుగులు తీస్తుంటే


నువ్వే కావాలని , నిన్నే గెలవాలని ,
మనసే విప్పాలని , మాటే చెప్పాలని ,
అది ప్రేమో ఏమో తెలియని వింత యాతన ,
అది ప్రేమేనేమో ఎరుగని కొంటె భావన .