Wednesday, August 11, 2010

నిన్ను చూడగా ...

For those who love



నిన్ను చూడగా గుండెలో ఎన్నెన్నో రాగాలు...

మనసునిండుగా మ్రోగెనులే ఏవేవో తాళాలు..

తనువంతా సంగీతం...తపనలతో సావాసం...

ఊహలలో ప్రయాణం...మేఘాల్లో సరాగం..

పరిచెయమయ్యెను కొత్త భాష..అనుభవమయ్యెను తీపి ఘోష..



నిన్ను చేరే సమయాన..పెదవే దాటని మాటలమూటలు విప్పి కళ్ళతో ఎన్నోఊసులు చెప్పెయ్యనా..

నిన్ను తలచే విరహాన.. కొంటె ఆశలు కలవరపెడితే నిజమంటి కలగా కలలో నిజమై దరిచేరనా..

ఆకాశం అందనంత దూరంలో లేదులే...జాబిల్లిలా నాముందే నువ్వుంటే..

వెన్నెల్లో హాయి పగలైనా చేరునులే..నాగమల్లిలా నువ్వు నవ్వుతుంటే...



గుండె వేగం తగ్గేనా..ఓ నిముషం పాటు నీ ఓరచూపే నా తనువుని తడిమీ కన్నుగీటుతుంటే..

కలకంటున్నాననుకున్నా.. నువ్వు కళ్ళముందున్నా పోల్చలేకున్నా నిజమే కలలాగున్నదే..

గుండెలోనే గువ్వలా దాగున్నావే...అయినా నీకోసం ఎక్కడో వెదుకులాట..

చెప్పవే మనసా నువ్వైనా నా కళ్ళకి...నీలోనే దాగున్న నాచెలి చిరునామాని