
వేయి కన్నులతో వేచి చూస్తున్నా .....
తెరచాటు దాటి చేరదా నీ స్నేహం !
కోటి ఆశలతో కోరుకుంటున్నా
కరుణించి ఆదరించదా నీ స్నేహం !
ప్రాణమే నీకు కానుకంటూన్నా
మన్నించి అందుకోవ నేస్తమా !
ఎప్పటికి నా మదిలో కొలువున్నధీ నువ్వే నా
చెప్పుకునే వీలుందా ఆ సంగతి ఎప్పుడైనా .....
రెప్పదాటి రాననే స్వప్నమేమి కానని ...
ఒప్పుకుంటే నేరమా తప్పుకుంటే న్యాయమా ..
ఒక్కసారి అయినా చేయి అందించి ఈ దూరాన్ని కరిగించుమా ....