Saturday, April 21, 2012

పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో





పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో 
ప్రణయ సుధా రాధా.. నా బ్రతుకు నీది కాదా.. 

నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే 
నాదన్నది ఏమున్నది నాలో 
నీవేనాడు మలిచావు ఈ రాతినీ 
నేనీనాడు పలకాలి నీ గీతినీ
ఇదే నాకు తపమనీ ఇదే నాకు వరమనీ
ఇదే నాకు తపమనీ ఇదే నాకు వరమనీ
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉందీ
చెప్పాలని ఉందీ గుండె విప్పాలని ఉందీ 

నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని 
నీ వీణకు నాదాన్ని కానా
నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధనా 
నీకు ఈనాడు తెలిపేది నా..వేదనా
ఇదే నిన్ను వినమనీ.. ఇదే నిజం అనమనీ
ఇదే నిన్ను వినమనీ.. ఇదే నిజం అనమనీ 
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉందీ 
చెప్పాలని ఉందీ.. గుండె విప్పాలని ఉందీ