నిన్ను కాదని దూరంగా తరిమి కొట్టాక,
నాలో దాగి ఉన్న నీ తలపు నా మదిని తట్టిలేపింది.
కనులముందు కానరాకు అని ఈసడించుకున్నాక,
జగాన్ని చీకటి చేస్తూ నీ రూపం కనులను కమ్మేసింది.
నిన్ను చూసే ప్రతిరోజూ నాకొక నరకం అన్న నా హృదయం,
ఈనాడు నీ ఎడబాటులో క్షణమోక నరకంగా మార్చేసింది.
ఎక్కడున్నావో ప్రియా... నీ ప్రేమను చంపేస్తూ........
ఎప్పుడొస్తావో ప్రియా... నా ప్రేమకు ఊపిరిపోస్తూ.......
