Thursday, January 19, 2012







నా మాటను మన్నించి ప్రేమ పంచడం నువ్వు ఆపాక
మనసు పొరలు చీల్చుకుంటూ నా ప్రేమ ఉరకడం మొదలుపెట్టింది


నిన్ను కాదని దూరంగా తరిమికొట్టాక
కనులముందు కానరాకు అని ఈసడించుకున్నాక జగాన్ని చీకటి చేస్తూ నీ రూపం కనులను కమ్మేసింది నాలో దాగి ఉన్న నీ తలపు నా మదిని తట్టిలేపింది

 నిన్ను చూసే ప్రతిరోజూ నాకొక నరకం అన్న నా హృదయం

ఈనాడు నీ ఎడబాటులో క్షణమోక నరకంగా మార్చేసింది

 ప్రేమంటే ఇదే అని తెలియని ఆ రోజు నిన్ను దూరం చేసుకున్నాను 
నువ్వే ప్రేమవని తెలిసిన మరుక్షణం నీ ప్రేమ కోసం వెతుకుతున్నాను
 ఎక్కడున్నావో ప్రియా... నీ ప్రేమను చంపేస్తూ...
 ఎప్పుడొస్తావో ప్రియా... నా ప్రేమకు ఊపిరిపోస్తూ...