Saturday, February 27, 2010

కల అనుకోనా నిజం అనుకోనా...


కల అనుకోనా నిజం అనుకోనా... ఈ వేళలో ఈ తోడులో
వలపనుకోనా లేక వరమనుకోనా ఈ హాయిలో ఈ జోరులో

చూస్తూ ఉండగా నన్ను మార్చావు
నేనే నమ్మని నన్నే చూపావు

నేనే ఎరుగని నన్నే చూసావు
నాకే తెలియని కలలే రేపావు

ఏదో తీయని మాయని దాచావు
నాపై ఏదో మత్తుని జల్లావు

పిలుపనుకోనా గెలుపనుకోనా నీ పలుకులో కనుసైఘలో
స్వరమనుకోనా లేక లయ అనుకోనా నీ పాటలో ప్రతి మాటలో

చినుకై నన్నే తడపగా చేరావు
వారధి నన్నే ముంచి పోయావు

వెలుగై నాలో చీకటి తరిమావు
గెలుపై నాలో వలపును రేపావు

క్షణమై నాతో ఉండగా వచ్చావు
యుగమై నాతో పయనం సాగావు

మలుపనుకోనా మరుపనుకోనా ఈ బాధలో ... తీపి చేదులో
సిరులనుకోనా లేక మనులనుకోన నీ నవ్వులో ముత్యాలలో

కాలము ఎరుగని కావ్యము రాసావు
కన్నుల సైఘల భావము కూర్చావు

మేఘము పాడిన పాటగా సాగావు
భావము లేని రాగమై అల్లావు

నాలో వలపుల భావము నింపావు
ఈ పాటగా నేడే జాలువారావు .....